న్యూఢిల్లీ, మే 26: కాఫీ ఎంతమాత్రమూ తాగనివారితో పోల్చితే కాఫీ తాగేవారికి ‘పార్కిన్సన్స్’ వ్యాధి బారినపడే ముప్పు తక్కువని తాజా అధ్యయనం వెల్లడించింది. కాఫీ గిం జల్లో ఉండే కెఫైన్.. పార్కిన్సన్స్ వ్యాధి బారిన పడకుండా వ్యక్తులపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది పరిశోధకులు వివరించారు. 1,84,024 మంది నుంచి సేకరించిన డాటాను విశ్లేషించి.. పై నిర్ధారణకు వచ్చారు.
పార్కిన్సన్ వ్యాధితో బాధపడే రోగి మెదడు పనితీరు మెల్లగా దెబ్బతింటుంది. అసంకల్పితంగా వణకడం, కదలికలు నెమ్మదించటం, కండరాలు బిగుసుకుపోవటం వంటి లక్షణాలు ఉంటాయి. దీనికి చికిత్స లేదు. జన్యుపరంగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నవాళ్లలో ముప్పును తగ్గించటంపై పరిశోధకులు దృష్టిసారించారు.