న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో చురుకుగా ఉండే కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర తరచూ మోటివేటింగ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అడవిలో టైగర్ నడుచుకుంటూ వస్తున్న వీడియోను (viral video) ఆనంద్ మహీంద్ర మండే మోటివేషన్ పోస్ట్ కింద ట్వీట్ చేశారు.
Walk into work with quiet confidence. Your voice will be heard. #MondayMotivation (credit: @trikansh_sharma ) pic.twitter.com/J67Zc9DKfp
— anand mahindra (@anandmahindra) March 27, 2023
ఈ వీడియోలో అడవిలో మెల్లిగా నడుచుకుంటూ వస్తున్న పులి కనిపించగా అంది ఎంతో విశ్వాసంతో, ధీమాతో ముందుకు నడుస్తుంది. ఈ వైరల్ వీడియోను ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో షేర్ చేశారు. 15 సెకండ్ల నిడివితో కూడిన ఈ వీడియోలో ముందుగా జింకలు కనిపిస్తాయి.
ఈ వీడియోను త్రికాన్ష్ శర్మ కెమెరాలో రికార్డు చేశారు. ఎనలేని విశ్వాసంతో పనిలోకి నడవడి..మీ గళం గట్టిగా వినపడాలని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి లక్షకు పైగా వ్యూస్ లభించాయి. ఈ లక్షణం ప్రతి ఒక్కరికీ అవసరమని ఓ యూజర్ కామెంట్ చేయగా ఇది సరైన మండే మోటివేషన్ పోస్ట్ అని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
viral video | టీం సభ్యులతో కలిసి నాటు నాటు సాంగ్‌కు స్టెప్పులేసిన మేనేజర్