న్యూఢిల్లీ : ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందడంతో ఈ పాటకు స్టెప్పులేసిన వీడియోలను (viral video) పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.
లేటెస్ట్గా ఈ సాంగ్‌కు ఓ మేనేజర్ తమ టీం సభ్యులతో కలిసి క్రేజీ స్టెప్స్‌తో హోరెత్తించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మేనేజర్ తమ టీం సభ్యులకు నాటు నాటు హుక్ స్టెప్‌ను నేర్పిస్తుండటం కనిపించింది.
టీం సభ్యులు మేనేజర్ చేసిన తరహాలో స్టెప్స్‌ను ప్రయత్నించారు. ఈ వీడియోకు కీపింగ్ ఇట్ రియల్ ఆన్ మండే అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ వీడియో ఆన్లైన్లో షేర్ చేసినప్పటినుంచి 16 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి.
Read More :