బెంగళూరులో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు వీధులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోయి జనం అవస్థలుపడుతున్నారు. ఐటీ ఉద్యోగులు ట్రాక్టర్లపై ఆఫీసులకెళ్లారు. రోడ్డుపై వరదనీరు చేరడంతో కొందరు ఎక్స్‌కవేటర్‌పై వెళ్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను షేర్చేస్తూ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర పెట్టిన ట్వీట్‌కు నెటిజన్లనుంచి భారీ స్పందన వస్తోంది.
ఆనంద్ మహీంద్ర ట్విటర్లో యాక్టివ్‌గా ఉంటారు. సృజనాత్మక, మోటివేషనల్ పోస్టులు పెడుతుంటారు. తాజాగా, బెంగళూరు రోడ్డుపై కొందరు ఎక్స్‌కవేటర్‌పై వెళ్తున్న వీడియోను గోవింద్‌కుమార్ అనే యూజర్ ట్విటర్లో షేర్చేశారు. ఈ వీడియోలో ఇద్దరు డ్రైవర్ వద్ద నిల్చుని ఉండగా, మిగతావారు బ్లేడ్‌పై నిల్చున్నారు. మంచి బట్టలు ధరించి, చేతిలో బ్యాగ్ పట్టుకొని ఐటీ ఆఫీసులకు వెళ్తున్నట్టుగా కనిపించారు. ఎక్స్కవేటర్ నీటిలో నెమ్మదిగా వెళ్తోంది. ఈ వీడియోపై ఆనంద్ మహీంద్ర స్పందించారు. ‘ఎక్కడ ఒక సంకల్పం ఉంటే అక్కడ ఒక మార్గం ఉంటుంది.’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. ఇండియన్ జుగాడ్‌ను ప్రశంసించారు. అలాగే, అగ్రశ్రేణి ఐటీ కంపెనీలకు నెలవైన బెంగళూరులో సరైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టకపోవడంపై పలువురు మండిపడ్డారు.
I second that thought. Where there’s a will, there’s a way… https://t.co/aJvxVfCbXn
— anand mahindra (@anandmahindra) September 6, 2022