న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో చురుకుగా ఉండే కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) వినోదాత్మక వీడియోలతో పాటు ఆలోచన రేకెత్తించే పోస్ట్‌లు తరచూ షేర్ చేస్తుంటారు. కొత్త ప్రదేశాలు, సరికొత్త విషయాలను ఆయన సోషల్ మీడియా వేదికగా వినూత్నంగా ఆవిష్కరిస్తుంటారు.
ఇథియోపియాలోని మెస్కెల్ స్క్వేర్‌లో రికార్డు చేసిన ఓ వీడియో క్లిప్ మహీంద్ర గ్రూప్ చీఫ్ దృష్టిని ఆకర్షించగా ఆయన తన ఫ్రొఫైల్లో ఈ వైరల్ క్లిప్‌ను షేర్ చేశారు. ఈ వీడియోలో ట్రాఫిక్ లైట్స్ లేని ఓ బిజీ జంక్షన్లో వాహనాలు గందరగోళంగా పరుగులు తీస్తుండటం కనిపిస్తుంది. ట్రాఫిక్ లైట్స్ లేని ఇథియోపియాలోని అత్యంత రద్దీ కూడలి..నో..వ్యవస్ధీకృత గందరగోళంలో వరల్డ్ టైటిల్‌ను భారత్ వదులుకోవడాన్ని నిరాకరిస్తా అని ఈ పోస్ట్‌కు ఆయన సరదాగా కామెంట్ చేశారు.
Busiest intersection in Ethiopia without traffic lights. No no no. I refuse to let india relinquish the world title for organised chaos! 😊 pic.twitter.com/JMA9j7NuP9
— anand mahindra (@anandmahindra) August 10, 2023
ఈ వీడియో మన దేశంలోని బిజీ రోడ్లు, ట్రాఫిక్ కష్టాలను గుర్తుకు తెచ్చింది. క్రమబద్ధీకరించని ట్రాఫిక్‌లు, రహదారులపై బారులుతీరిన వాహనాలు మన రోడ్లపై దర్శనమిస్తుంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయని పరిస్ధితిని పలువురు యూజర్లు తమ కామెంట్స్‌లో ప్రస్తావించారు. ఈ వీడియోను నెట్టింట షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏకంగా 3.4 లక్షల వ్యూస్ లభించాయి.
Read More :