డెహ్రాడూన్: వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర(Anand Mahindra) తన ఎక్స్‌లో ఓ కొత్త ఫోటో పోస్టు చేశారు. కేదారీశ్వరుడి ఆలయానికి చెందిన ఫోటోను ఆయన తన ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే 144 ఏళ్ల క్రితం .. హిమాలయాల ఒడిలో ఉన్న పరమశివుడి క్షేత్రంగా వర్ణిస్తూ ఆయన ఓ ఫోటో పెట్టారు. ఛార్‌ధామ్ యాత్రలో భాగమైన జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఇప్పుడు విశేష సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తున్నది. అయితే ఆ ఆలయానికి చెందిన ఓ అరుదైన ఫోటోను ఆనంద్ మహేంద్ర తన ఎక్స్‌లో పెట్టారు. 1882లో ఆ ఫోటోను తీసినట్లు ఆయన పేర్కొన్నారు. పవిత్రమైన కేదార్నాథ్ ధామ్ ఫోటో ఇది అన్నారు. ఆ ఫోటో నుంచి తన కండ్లను తిప్పలేకపోతున్నట్లు చెప్పారు. ఆ రోజుల్లో రోడ్లు లేవు, రైలుమార్గాలు లేవు, హెలికాప్టర్లు లేవు అని పోస్టులో ఆయన రాశారు.
ఆ రోజుల్లో యాత్ర చేపట్టాలంటే ఓ సాహసమే. సమయం, శక్తి, నమ్మకం అన్నీ ముఖ్యం. అదేమీ ఆషామాషీగా చేపట్టే యాత్ర కాదు అని, అదే నిజమైన యాత్ర అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేదార్‌నాథ్‌కు వెళ్లడం చాలా సులువైందన్నారు. ఇదొరకంగా మంచి పరిణామమే అని, దీని వల్ల అందరూ ఆ దైవాన్ని చేరుకునే అవకాశం వస్తుందన్నారు. కానీ పరిరక్షించాల్సిన విషయాలు చాలా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ట్రావలింగ్ అనుభవం ముఖ్యమైందని, దాన్ని ఎంజాయ్ చేయాలని ఆయన తెలిపారు. ఆ జర్నీలే మనల్ని మన మార్గం వైపు మళ్లిస్తాయన్నారు.
Apparently, this is one of the earliest known photographs of the sacred Kedarnath Dham, taken in 1882.
Couldn’t take my eyes off it.
No roads. No railheads. No helicopters.
Just the abode of Lord Shiva, cradled by the Himalayas
Back then, the yatra demanded time, endurance,… pic.twitter.com/UfvWVsmLnf
— anand mahindra (@anandmahindra) April 26, 2026
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కేదార్నాథ్ ఆలయం ఉన్నది. సుమారు 3584 మీటర్ల ఎత్తులో కేదారీశ్వరుడు కొలువై ఉన్నాడు. భారతీయులు పరమపవిత్రంగా భావించే జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఇది ఒకటి. కేవలం ఆరు నెలలు మాత్రం ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. ఇక్కడ వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉండడం వల్ల.. చలికాలంలో ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. ఇక ఈ ఏడాది కేదార్‌నాథ్‌కు భక్తుల తాకిడి మరీ అధికంగా ఉన్నది. ఆలయాన్ని ఓపెన్ చేసిన తొలి మూడు రోజుల్లోనే కేదారీశ్వరుడిని దర్శించుకున్నవారి సంఖ్య లక్షకుపైగా నమోదు అయ్యింది.