సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనకు నచ్చిన అంశాలను తన ఫాలోవర్లతో పంచుకుంటూ ఉండే బడా వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. ఆయన ఎప్పుడు ఎలాంటి వీడియో షేర్ చేసినా అది నెటిజన్లను అబ్బురపరుస్తూనే ఉంటుంది. తాజాగా ఆయన అలాంటిదే మరో వీడియో షేర్ చేశారు. సదరు వీడియోలో ఒక ఇంటి గోడపై డెకరేషన్‌గా ఐరన్ రాడ్లతో డిజైన్ కనిపించింది.
ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక వ్యక్తి వచ్చి.. ఆ డిజైన్‌కు వేసి ఉన్న ఒక చిన్న లాక్ తొలగించి దాన్ని మెట్లుగా మార్చేశాడు. ఆ మెట్లపై ఎక్కి మొదటి అంతస్తు చేరుకొని తిరిగొచ్చాడు. ఆ తర్వాత మళ్లీ లాక్ చేసేసి చూపించాడు. ఈ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా..
‘‘అద్భుతం. చాలా సింపుల్‌గా కనిపిస్తున్నా ఎంతో క్రియేటివ్‌గా ఉంది. కేవలం స్థలాన్ని సేవ్ చెయ్యడమే కాదు.. బోసిగా ఉండే గోడపై మంచి డిజైన్లా కూడా ఉంది. ఇది చూసిన తర్వాత స్కాండనేవియన్ డిజైనర్లు కూడా ఈర్ష్య పడాల్సిందే. (ఇది ఎక్కడిదో తెలియదు. నా వాట్సాప్ వండర్ బాక్స్‌లో ఎవరో పంపారు)’’ అని ట్వీట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు కూడా ఆ క్రియేటివిటీకి ఫిదా అయిపోతున్నారు. చాలా అద్భుతంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
Outstanding. So simple yet creative. Apart from de-cluttering space, this actually adds an attractive aesthetic element to an otherwise stark exterior wall. Should make Scandinavian designers envious!! (Don’t know where this is from. Received in my #whatsappwonderbox ) pic.twitter.com/IBC6RR591y
— anand mahindra (@anandmahindra) July 16, 2022