Anand Mahindra | కొందరికి అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నా.. అన్నీ బాగున్నా ఎప్పుడూ ఎదుటివారిని నిందిస్తుంటారు. పనులు లేవు అంటారు. డబ్బు సంపాదించడానికి నానా తంటాలు పడతారు. కానీ.. ఈ వ్యక్తి చూడండి. కాళ్లు లేవు.. చేతులు లేవు.. కానీ ఆత్మవిశ్వాసం నిండుగా ఉంది. అందుకే.. అతడికి ఉద్యోగం ఇచ్చాడు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అది ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిది. తనకు రెండు చేతులు, కాళ్లు లేవు. అయినప్పటికీ.. తన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ట్రాలీ లాంటి వాహనాన్ని నడుపుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.
నాకు పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు. తండ్రిని కూడా పోషించాలి. కానీ.. నాకు పుట్టుకతోనే చేతులు, కాళ్లు లేవు. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని.. ఇలా వాహనాన్ని నాకు అనుగుణంగా తయారు చేయించా. ఈ వాహనంలో సరుకుల లోడ్ వేసుకెళ్తూ.. నాలుగు రూపాయలు సంపాదిస్తున్నా.. అని ఆ వ్యక్తి వీడియోలో చెప్పుకొచ్చాడు. గత 5 సంవత్సరాల నుంచి ఢిల్లీలో ఈ వాహనాన్ని నడుపుతున్నాడట.
ఈ వీడియో ఆనంద్ మహీంద్రా కంటపడింది. ఆ వీడియోను చూడగానే… తనకు మహీంద్రా కంపెనీలో బిజినెస్ అసోసియేట్‌గా ఉద్యోగం ఇస్తున్నట్టు ప్రకటించాడు. మహీంద్రా లాజిస్టిక్స్ కంపెనీలో ఎలక్ట్రిక్ లాస్ట్ మైల్ డెలివరీ సర్వీస్ కోసం బిజినెస్ అసోసియేట్‌గా ఉద్యోగం ఇస్తున్నట్టు ప్రకటించాడు. అతడి వివరాలు కనుక్కొని వెంటనే ఉద్యోగాన్ని ఇవ్వాలని కంపెనీ సిబ్బందిని ట్విట్టర్లోనే ఆదేశించాడు ఆనంద్.
కాళ్లు చేతులు లేకున్నా.. ఎంతో ఆత్మవిశ్వాసంతో సొంతంగా పని చేసుకొని డబ్బులు సంపాదిస్తున్న అతడికి ఉద్యోగం ఇచ్చినందుకు నెటిజన్లు ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఏదైనా సాధించాలంటే కావాల్సింది పట్టుదల, శ్రమ, ఆత్మవిశ్వాసం. అవి ఉంటే ఎలాంటి కష్టాలను అయినా ఇట్టే ఎదుర్కోవచ్చు.. అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇటీవలే.. ఓ వ్యక్తి ఓ వాహనంలో మార్పులు చేసి.. దాంట్లో ప్రయాణికులు కూర్చునేలా ఏర్పాటు చేశాడు. ఆ వాహనాన్ని చూసిన ఆనంద్ మహీంద్రా.. ఆ వాహనాన్ని తనకిచ్చేయాలంటూ కోరాడు. తనకు మహీంద్రా బొలెరో ఎస్‌యూవీని గిఫ్ట్‌గా ఇస్తానని కూడా బంపర్ ఆఫర్ ప్రకటించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
చలికాలంలో రమ్‌కు ఎందుకంత క్రేజ్? రమ్‌ను ఎలా తయారు చేస్తారు?
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి? రోజూ షాంపూ పెట్టొచ్చా?