Rum in Winter | రమ్ పేరు విన్నారా ఎప్పుడైనా.. ? మందుబాబులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది విస్కీని తాగుతుంటారు. మరికొందరు బ్రాండీ, ఆ తర్వాత రమ్, వైన్ తాగుతారు. బీర్లు తాగేవాళ్ల లెక్క వేరే. చలికాలం వచ్చిందంటే చాలు.. ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది రమ్నే. అసలు రమ్‌ను ఎందుకు మందుబాబులు ఇష్టపడతారు? దాన్ని ఎలా తయారు చేస్తారు.. అనే విషయాలు తెలుసుకుందాం రండి.
ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో ఉండే ప్రజలు… రమ్, బ్రాండీని ఎక్కువగా తాగుతారు. మన దగ్గర మాత్రం చలికాలంలో ఈ బ్రాండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం.. రమ్ తాగితే శరీరం వేడెక్కడమే. చలికాలంలో చాలామంది శరీరం చల్లగా మారుతుంది. శరీరాన్ని వేడిగా ఉంచుకునేందుకు.. చలి బారి నుంచి తప్పించుకునేందుకు రమ్‌ను తాగుతారు. రమ్‌లో 40 శాతం వరకు ఆల్కాహాల్ ఉంటుంది.
రమ్‌ను చెరుకు రసం నుంచి తయారు చేస్తారు. చెరుకు రసాన్ని బాగా వేడి చేసి.. చల్లార్చుతారు. మళ్లీ వేడిచేస్తారు. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని పులియబెడతారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆ మిశ్రమాన్ని వేడి చేసి.. దాన్ని వడబోసి దాంట్లో కెమికల్స్, ఫ్లేవర్స్, స్పిరిట్ కలిపి రమ్ తయారు చేస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
హైదరాబాదీ బిర్యానీ ఒక్కటేనా.. ఈ పది బిర్యానీల రుచి కూడా చూడండి
గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ.. ఇది ఎక్కడుంది.. దాని ప్రత్యేకతలేంటో తెలుసా?