బెంగళూరు: కర్ణాటకలోని దేవగొండనహళ్లి గ్రామస్థులను ఓ అంతుబట్టని వ్యాధి దాదాపు 45 రోజుల నుంచి పీడిస్తున్నది. కాళ్లు వాచిపోవడం, విపరీతమైన ఒళ్లు నొప్పులతో అనేక మంది బాధపడుతున్నారు. ఈ వ్యా ధి సోకినవారు తమ రోజువారీ పనులను చేసుకోలేకపోతున్నారు.
కొందరైతే మంచానికి పరిమితమయ్యారు. ఈ గ్రామంలో జ్వరం, కీళ్ల నొప్పు లు, డెంగ్యూ వ్యాధి కూడా ప్రబలింది. బాధితులు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల్లో చికిత్స చేయించుకుంటున్నప్పటికీ ఉపశమనం దొరకడం లేదు. దీనిపై తాలూకా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సీమ మాట్లాడుతూ, క్రమం తప్పకుండా లార్వా సర్వే చేస్తున్నామన్నారు.