శత్రుత్వం వీడి..చర్చలు జరపండి
ఆపరేషన్ సిందూర్ జరిగి ఏడాది దాటిన తర్వాత ఇరు దేశాల మధ్య శాంతి, సంప్రదింపులు, సాధారణ ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే దిశగా పటిష్టమైన, నిరంతర చర్యలు తీసుకోవాలని భారత్, పాకిస్థాన్‌లకు చెందిన పలువురు రాజకీయ నాయకులుసహా 100 మందికి పైగా ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌నకు సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు.
- మోదీ, షరీఫ్‌నకు భారత్, పాక్ ప్రముఖుల విజ్ఞప్తి
న్యూఢిల్లీ, జూలై 1: ఆపరేషన్ సిందూర్ జరిగి ఏడాది దాటిన తర్వాత ఇరు దేశాల మధ్య శాంతి, సంప్రదింపులు, సాధారణ ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే దిశగా పటిష్టమైన, నిరంతర చర్యలు తీసుకోవాలని భారత్, పాకిస్థాన్‌లకు చెందిన పలువురు రాజకీయ నాయకులుసహా 100 మందికి పైగా ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌నకు సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు. సెంటర్ ఫర్ పీస్ అండ్ ప్రోగ్రెస్ జారీ చేసిన ఈ విజ్ఞప్తిపై భారత్‌కు చెందిన 61 మంది, పాక్‌కు చెందిన 56 మందిసహా మొత్తం 117 మంది సంతకాలు చేశారు. ఈ లేఖపై సంతకం చేసిన భారతీయుల్లో ఫరూక్ అబ్దుల్లా, వేర్పాటువాద నాయకుడు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, మెహబూబా ముఫ్తీ, ఆర్జేడీ ఎంపీ మనోజ్ షా ఉన్నారు. సంతకం చేసిన పాక్ ప్రముఖుల్లో మాజీ విదేశాంగ మంత్రి మహమూద్ కసూరీ, మాజీ దౌత్యవేత్త అష్రఫ్ ఖాజీ, స్ఫన్యర్ భండారా, అణు శాస్త్రవేత్త, పర్వేజ్ హూద్భాయ్ ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

