ముంబై : పుణె మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సోమవారం నిర్వహించిన సమావేశానికి ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ కార్పొరేటర్లు హెల్మెట్లు పెట్టుకుని, చేతులకు నల్లబ్యాడ్జీలతో వచ్చి నిరసన తెలిపారు. కాంగ్రెస్ కార్పొరేటర్ ప్రశాంత్ జతాప్ మాట్లాడుతూ.. బీజేపీ సభ్యుల దురుసు, బెదిరింపు ధోరణికి నిరసనగా సమావేశంలో దాడి జరుగుతుందనే భయంతోనే ఇలా వచ్చామన్నారు.
పీఎంసీ మే నెలలో ఓ దర్గాను కూల్చడంపై గత నెలలో జరిగిన మీటింగ్లో బీజేపీ సభ్యుల ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని ఇలా వచ్చామన్నారు.