న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఓ నైట్ క్లబ్ లోపలికి అనుమతించపోవటంతో ఆరు బయటే ఉండి చలికి తట్టుకోలేక అమెరికాలో ఓ భారతీయ విద్యార్థి మృతి చెందాడు. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్లో భారతీయ సంతతికి చెందిన అకుల్ ధావన్ ఉన్నత విద్యనభ్యసిస్తున్నాడు. జనవరి 20న క్యాంపస్‌కు సమీపంలోని నైట్‌క్లబ్‌కు వెళ్లాడు. అప్పటికే అతని స్నేహితులు నైట్‌క్లబ్ లోపల ఉండిపోయారు.
ధావన్‌ను మాత్రం క్లబ్‌లోకి ప్రవేశించటానికి అక్కడి సిబ్బంది నిరాకరించారు. అర్ధరాత్రి 11.30 ప్రాంతంలో క్లబ్‌కు చేరుకున్న ధావన్ పలుమార్లు ప్రయత్నించినప్పటికీ రెస్టారెంట్ సిబ్బంది అతడిని లోపలకు అనుమతించలేదు. అప్పటికే తాగిన మత్తులో ఉన్న ధావన్ ఆ పక్కనే ఉన్న భవంతి మెట్లపై పడుకొని చలికి తట్టుకోలేక ప్రాణాలొదిలాడు.