చెన్నై: భారత వైమానిక దళ శిక్షణ విమానం ఒకటి శుక్రవారం చెన్నైలోని తాంబరం వద్ద ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా తప్పించుకున్నారు.
పిలాటస్ పీసీ-7 విమానం రోజువారీ శిక్షణా కార్యక్రమంలో భాగంగా వెళ్లి మధ్యాహ్నం రెండు గంటలకు కూలిపోయిందని, అయితే పైలట్ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై నిజానిజాలు తెలుసుకునేందుకు కోర్టు ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించినట్టు వారు తెలిపారు.