కోయంబత్తూరు, మార్చి 9: ఫ్రిడ్జ్ పేలి ఒక పోలీస్ అధికారి, మహిళ మృతి చెందిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకొన్నది. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి సమీపంలోని నల్లూరులో గురువారం ఈ ప్రమాదం సంభవించింది.
చెన్నైలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శబరినాథ్ సహా శాంతి అనే మహిళ ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఇంట్లోని ఫ్రిడ్జ్ పేలడం వల్లే వీరు మరణించినట్టు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు అది పేలడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.