నాసిక్ : మహారాష్ట్రలో ఇవాళ భూకంపం వచ్చింది. నాసిక్‌కు 95 కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ ప్రాంతంలో భూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.5గా ఉంది. భారత కాలమానం ప్రకారం 2.28 నిమిషాలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ తెలిపింది.