హమీర్పూర్, సెప్టెంబర్ 15: ఒక మహిళ జుట్టు కత్తిరించి ముఖానికి నల్లరంగు పూసి గ్రామంలో ఊరేగించిన దారుణ ఘటన కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అత్తమామల దాష్టీకానికి సంబంధించిన మూడు నిముషాల వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.
రంగంలోకి దిగిన పోలీసులు అత్తమామలు సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఆగస్టు 31న భోరంజ్ ప్రాంతంలోని హమీర్‌పూర్‌లో బాధితురాలి అత్తమామలు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు నిర్ధారించారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకుని అత్తమామలు, ఇతరులపై కేసు నమోదు చేశారు.