All party meet : కేంద్ర ప్రభుత్వం (Union govt) ఈ నెల 27న అఖిలపక్ష సమావేశం (All party meet) నిర్వహించనుంది. ఈ మేరకు పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలకు లేఖలు రాసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) పేరుతో అన్ని పార్టీలకు లేఖలు అందాయి.
బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఈ సమావేశంలో విపక్ష పార్టీలను కేంద్రం కోరనుంది. ఈ సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బిల్లుల వివరాలను అన్ని పార్టీల ప్రతినిధులకు తెలియజేయనుంది.