Amruta Fadnavis: డిజైనర్‌పై కేసు పెట్టిన అమృతా ఫడ్నవీస్
Amruta Fadnavis: ఓ డిజైనర్ తను బెదిరిస్తున్నట్లు అమృత ఫిర్యాదు చేశారు. ఆ మహిళ తనకు లంచం ఇచ్చేందుకు కూడా ప్రయత్నించినట్లు అమృత ఫడ్నవీస్ తెలిపారు.
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్(Amrutha Fadnavis) .. ముంబైకి చెందిన ఓ లేడీ డిజైనర్(designer)పై కేసు బుక్ చేశారు. అనిక్షా అనే మహిళతో పాటు ఆమె తండ్రిపై ఎఫ్ఐఆర్లో ఫిర్యాదు నమోదు చేశారు. డిజైనర్ అనిక్షా(Aniksha) తనను బెదిరిస్తున్నట్లు, తనకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు అమృత తన ఎఫ్ఐఆర్లో ఆరోపించారు. ఫిబ్రవరి 20వ తేదీ ఆ ఎఫ్ఐఆర్ను ఆమె పోలీసులకు ఇచ్చారు.
డిజైనర్ తండ్రి ఓ క్రిమినల్ కేసు(criminal case)లో ఇరుక్కున్నారని, ఆయన్ను కాపాడేందుకు చొరవ చూపాలని, దాని కోసం కోటి రూపాయాలు ఇచ్చేందుకు ఆమె ప్రయత్నించినట్లు అమృతా ఫడ్నవీస్ ఆరోపించారు. 2021 నవంబర్‌లో అమృతను తొలిసారి ఆ మహిళ కలిశారు. ఫిబ్రవరి 18,19 తేదీల్లో డిజైనర్ అనిక్షా తనకు వీడియో క్లిప్‌లను, వాయిస్ నోట్స్, మెసేజ్‌లను పంపినట్లు అమృత తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అమృత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు(mumbai police) ఆ డిజైనర్‌పై కేసు నమోదు చేశారు. ఆ మహిళ, ఆమె తండ్రి కుట్ర పన్నుతున్నట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దుస్తులు, జ్వలరీ,ఫూట్వియర్కు చెందిన వ్యాపారం చేస్తున్న మహిళ అమృతను కలిశారు. తాను రూపొందిచిన దుస్తులు, జ్వలరీని పబ్లిక్ ఈవెంట్స్(public events) సమయంలో వేసుకోవాలని కోరినట్లు అమృత చెప్పారు. ప్రమోషన్ కోసం ఆ పనిచేయాలని ఆ డిజైనర్ కోరినట్లు అమృత వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

