పుణె: మహారాష్ట్రలోని పుణెలో ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో అమోనియా గ్యాస్ లీకైంది(Gas Leak). ఈ ఘటనలో 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంట్లో 15 మంది మహిళలు ఉన్నారు. పుణె జిల్లాలోని భంద్గావ్లో ఆ ప్రాసెసింగ్ యూనిట్ ఉన్నది. ఒక వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతుండగా, మరో 16 మంది డేంజర్ నుంచి బయటపడినట్లు అధికారులు చెప్పారు. రెడీ టు ఈట్ ఫుడ్ ప్రిపరేషన్ సమయంలో గ్యాస్ లీక్ ఘటన జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో మైనస్ 18 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆహారాన్ని తయారు చేస్తుంటారు. దీని కోసం అమోనియా వాయువును వాడుతారు.