Bomb Threat Mail : దేశ రాజధాని ఢిల్లీలోని సాకేత్ ప్రాంతం ఓ బెదిరింపు మెయిల్‌తో నిలువెల్లా వణికింది. ఈనెల 13న ఆ ప్రాంతంలోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్‌ను పేల్చివేస్తామని బాంబు హెచ్చరికతో కూడిన మెయిల్ రావడం కలకలం రేపింది.
మంగళవారం అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్‌ను బాంబులతో పేల్చేస్తామని మెయిల్ రావడంతో స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. బెదిరింపు మెయిల్‌తో అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అమిటీ స్కూల్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
బాంబు స్క్వాడ్ స్కూల్ ప్రాంగణంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. బాంబు బెదరింపు మెయిల్ సోమవారం ఉదయం 9 గంటలకు రాగా, దుండగులు డబ్బు కూడా డిమాండ్ చేశారని స్కూల్ వర్గాలు తెలిపాయి.
Read More :
Age Limit | నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాలకు వయోపరిమితి మరో రెండేండ్లు పెంపు