కోయంబత్తూరు: ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష తమిళం అని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.అటువంటి గొప్ప భాష మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలని ఆయన ప్రజలను కోరారు. కోయంబత్తూరులో బుధవారం జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశ వ్యతిరేక పార్టీ అయిన డీఎంకే 2026 ఎన్నికల్లో ఓటమి పాలవుతుందని, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
హిందీని బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడులో అధికార డీఎంకే ఆరోపించడం, దానికి కేంద్రం బెదిరింపు సమాధానం చూస్తుంటే ఇదంతా చిన్నపిల్లల తగాదాలా ఉందని నటుడు, తమిళగ వెట్రీ కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ విమర్శించారు.