న్యూఢిల్లీ: మణిపూర్‌లో భద్రతా పరిస్థితి సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం నాడిక్కడ ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మార్చి 8 నుంచి మణిపూర్‌లోని అన్ని రోడ్లపై ప్రజలు స్వేచ్ఛగా తిరిగే విధంగా చూడాలని అమిత్ షా అధికారులను ఆదేశించారు. అవాంతరాలు సృష్టించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, ఇందుకు సంబంధించి అవసరమైన సహాయాన్ని అందచేస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. మణిపూర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల పొడవునా ఎంట్రీ పాయింట్ల వద్ద రెండు వైపులా కంచె నిర్మాణం పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.