Amit Shah @ Sri Nagar | కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తన బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్షీల్డ్ను తొలగించారు. జమ్ముకశ్మీర్‌లో మూడు రోజుల పర్యటన చివరి రోజు సోమవారం శ్రీనగర్‌లో బహిరంగ సభలో పాల్గొన్నారు. జన సందోహాన్ని చూశాక నేరుగా ప్రజలతో మాట్లాడాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి శ్రీనగర్‌లోని షేర్-ఈ-కశ్మీర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సభలో పాల్గొన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ పర్యవేక్షణలో బుల్లెట్ ఫ్రూప్ షీల్డ్‌ను వ్యక్తిగత భద్రతా సిబ్బంది ధ్వంసం చేశాక అమిత్‌షా మాట్లాడారు.
కశ్మీరీలు సంప్రదాయంగా ధరించే ఫెరాన్ డ్రస్‌తో ప్రజల ముందుకు వచ్చిన అమిత్‌షా.. నన్ను నిందించారు. విమర్శలు చేశారు. కానీ ఈ రోజు మీతో స్వేచ్ఛగా ( frankly ) మాట్లాడాలనుకుంటున్నా.. నాకు బుల్లెట్ ప్రూఫ్ గానీ, భద్రత గానీ లేవు. మీ ముందు నిలిచాను అని భావోద్వేగ భరితంగా మాట్లాడారు.
మేం పాకిస్థాన్‌తో మాట్లాడతాం అని ఫరూఖ్ (అబ్దుల్లా) సాహెబ్ చెప్పారు. కానీ నేను ఫరూఖ్ సాహెబ్‌కు, మీకు ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా. కశ్మీరీలోయలోని యువత, ప్రజలతో మాట్లాడతా అని చెప్పదలుచుకున్నా అని అన్నారు.
2019లో కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక అదే ఏడాది ఆగస్టు ఐదో తేదీన జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత కశ్మీర్ లోయలో హోంమంత్రి అమిత్‌షా తొలిసారి పర్యటిస్తున్నారు.
జమ్ముకశ్మీర్‌తోపాటు నూతనంగా ఏర్పాటు చేసిన లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఒకే ఒక్క కారణంతో 370 అధికరణాన్ని రద్దు చేశాం. 2024 నాటికి తమ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితాలు మీరు చూడొచ్చు అని అమిత్‌షా వ్యాఖ్యానించారు. శనివారం జమ్ముకశ్మీర్‌కు చేరుకున్న అమిత్‌షా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అమిత్‌షా పర్యటన నేపథ్యంలో లోయ అంతటా 5000 మంది భద్రతా సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
28 నుంచి ప్లిఫ్‌కార్ట్ బిగ్ దివాళి సేల్ : ఐఫోన్ 12, షియోమి ఫోన్లపై భారీ ఆఫర్లు!
EPFO Balance | పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా..
Tax on Gratuity | గ్రాట్యుటీ మీద పన్ను ఉంటుందా?
Fuel Price Hike | 2020 మే నుంచి పెట్రోల్, డీజిల్ ధరలెలా పెరిగాయంటే!
పెట్రోల్, డీజిల్ ధరలపై ‘శతాబ్ది ఉత్సవాలు జరుపుకోండి’.. కేంద్రానికి చిదంబరం చురకలు