Delhi Bomb Blast : ఢిల్లీ కారు పేలుడు ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అనంతరం.. ఆస్పత్రికి వెళ్లి క్షతగ్రాతులను పరామర్శించారు. అక్కడి నుంచి నేరుగా ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు షా. అక్కడే ఉన్న సీపీ శ్రీ సతీశ్ గుల్చా(Sri Satish Gulcha), దర్యాప్తు బృందం అధికారులతో కలిసి పరిస్థితిని ఆరా తీశారు. పేలుడులో తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్నవారిలో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు13 మంది చనిపోయారని సమాచారం. తీవ్రంగా గాయపడిన 30 మందికి వాళ్లకు ఎల్ఎన్జేపీ (LNJP) ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పేలుడుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని హోంమత్రి అమిత్ షా తెలిపారు. సంఘటనా స్థలానికంటే ముందు ఎల్ఎన్జేపీలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను షా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితితో పాటు పేలుడు గురించిన సమాచారాన్ని ఆయన తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పేలుడు జరిగిన ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్దకు వెళ్లారు షా. అక్కడ సీపీ శ్రీ సతీశ్ గుల్చా, ఎన్ఐఏ.. ఫోరెన్సిక్ అధికారులతో కలిసి ఘటనా స్థలిని ఆయన పరిశీలించారు. పేలుడుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని అధికారులు హోం మంత్రికి వివరించారు.
#WATCH | Delhi: Blast near Red Fort Metro Station | Union Home Minister Amit Shah says “This evening, around 7 pm, a blast occurred in a Hyundai i20 car at the Subhash Marg traffic signal near the Red Fort in Delhi. The blast injured some pedestrians and damaged some vehicles.… pic.twitter.com/BfRei3r3tx
— ANI (@ANI) November 10, 2025
ఢిల్లీ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలియజేశారు. ‘ఈ రోజు సాయంత్రం పేలుడులో మరణించిన వాళ్లకు సంతాపం తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. బాధితులకు అధికారులు అన్నివిధాలా సాయంగా ఉంటారు. పేలుడు ఘటనపై హోం మంత్రి అమిత్ షాతో, అధికారులతో మాట్లాడాను’ అని మోడీ ఎక్స్‌లో పేర్కొన్నారు.
Condolences to those who have lost their loved ones in the blast in Delhi earlier this evening. May the injured recover at the earliest. Those affected are being assisted by authorities. Reviewed the situation with Home Minister Amit Shah Ji and other officials.@AmitShah
— Narendra Modi (@narendramodi) November 10, 2025