మంగళవారం 14 జూలై 2020
National - Jun 18, 2020 , 12:50:34

ఢిల్లీ కోవిడ్‌-19 పరిస్థితిపై అమిత్‌ షా సమీక్ష

ఢిల్లీ కోవిడ్‌-19 పరిస్థితిపై అమిత్‌ షా సమీక్ష

ఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకి విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని నగరం ఢిల్లీలో కోవిడ్‌-19 పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నేడు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ రాష్ట్ర సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి నేడు వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు ఢిల్లీలో 47,102 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో 27,741 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వ్యాధి నుంచి కోలుకుని 17,457 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌-19 కారణంగా ఢిల్లీలో ఇప్పటివరకు 1,904 మంది చనిపోయారు.logo