కోల్‌కతా, మార్చి 17: డూప్లికేట్ ఓటర్లపై ప్రతిపక్షాలు నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించింది. నకిలీ ఓటర్లను గుర్తించేందుకు సాఫ్ట్‌వేర్‌లో కొత్త ఆప్షన్ తీసుకువస్తున్నట్టు ఎన్నికల అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు.
ఒకే ఓటర్ ఐడీపై ఎక్కువ ఓటర్లు నమోదైతే ఈ కొత్త ఆప్షన్ ద్వారా ఈఆర్వోలు గుర్తించేందుకు వీలవుతుందని చెప్పారు. దీనిపైన అన్ని రాష్ర్టాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. డూప్లికేట్ ఎపిక్ నంబర్ల ఏరివేతకు సంబంధించి కొత్త మాడ్యూల్ గురించి తెలుపుతూ చీఫ్ ఎలక్టోరల్ అధికారులకు లేఖలు పంపినట్టు చెప్పారు.