Watch: ఢిల్లీలో వర్షం నీటితో నిండిన రోడ్లు.. పడవ నడిపిన బీజేపీ నేత
BJP Councillor Rows Boat | దేశ రాజధాని ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో రోడ్డుపై నిండిన నీటిలో బీజేపీ నేత బోటు నడిపారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో రోడ్డుపై నిండిన నీటిలో బీజేపీ నేత బోటు నడిపారు. (BJP Councillor Rows Boat) ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంపై మండిపడ్డారు. భారీ వర్షాలకు తూర్పు ఢిల్లీలోని వినోద్ నగర్ ప్రాంతం జలమయమైంది. దీంతో స్థానికంగా నివసించే బీజేపీ కౌన్సిలర్ రవీందర్ సింగ్ నేగి వినూత్నంగా నిరసన తెలిపారు. గాలి బోటును వర్షం నీటిలో నడిపారు.
కాగా, ఆప్ ప్రభుత్వంపై రవీందర్ సింగ్ నేగి మండిపడ్డారు. ఢిల్లీలో అన్ని పీడబ్ల్యూడీ కాలువలు పొంగిపొర్లుతున్నాయని విమర్శించారు. మౌలిక సదుపాయాలు కుప్పకూలాయనడానికి ఇది నిదర్శనమని ఆరోపించారు. ‘వర్షాకాలం ముందు కాలువలను శుభ్రం చేయలేదు. దీంతో వర్షం వల్ల నీటి ముంపునకు దారితీసింది. వినోద్ నగర్ మునిగిపోయింది’ అని మీడియాతో అన్నారు. అయితే బీజేపీ కౌన్సిలర్ రవీందర్ సింగ్ నేగి వర్షం నీటితో నిండిన రోడ్డులో బోటింగ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Delhi: BJP Councillor Ravinder Singh Negi rows an inflatable boat amid severe waterlogging as a symbolic protest against Delhi Government. Visuals from NH9 area.
He says, "…All PWD drains are overflowing. They didn't get it cleaned ahead of Monsoon. This has led to… pic.twitter.com/eUMivjGYsR
— ANI (@ANI) June 28, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

