Helicopter Crash | టాంజానియా (Tanzania)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కిలిమంజారో పర్వతం (Mount Kilimanjaro)పై ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది (Helicopter Crash). ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ దేశ పౌర విమానయాన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కిలిమంజారో పర్వతంలోని బరాఫు శిబిరం సమీపంలో హెలికాప్టర్ కూలిపోయినట్లు పేర్కొంది. మృతుల్లో ఓ గైడ్, వైద్యుడు, పైలట్, ఇద్దరు విదేశీ పర్యాటకులు ఉన్నట్లు తెలిపింది. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ఆఫ్రికాలోనే ఎత్తైన శిఖరం కిలిమంజారో పర్వతం సముద్ర మట్టానికి దాదాపు 6,000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఏటా దాదాపు 50 వేల మంది పర్యాటకులు ఈ పర్వతాన్ని ఎక్కుతుంటారు. ఇక తాజా ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
Also Read..