Awami League | బంగ్లాదేశ్ (Bangladesh) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాగ్రహానికి జడిసి దేశం విడిచి పారిపోయిన పదవీచ్చుత ప్రధాన మంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ (Awami League Party)పై నిషేధం విధించింది. ప్రభుత్వ నిర్ణయంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అవామీ లీగ్పార్టీ కోల్పోయింది. మాజీ ప్రధాని ఖాలిదా జియా (Khaleda Zia) కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్ (Tarique Rahman) దాదాపు 17 ఏండ్ల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన వేళ ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.
మాజీ ప్రధాని ఖాలిదా జియా (Khaleda Zia) కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్ (Tarique Rahman) ఎట్టకేలకు స్వదేశంలో అడుగుపెట్టారు. దాదాపు 17 ఏండ్ల తర్వాత ఇవాళ ఢాకా చేరుకున్నారు. ఈ సందర్భంగా రెహమాన్, అతని కుటుంబ సభ్యులకు ఢాకా విమానాశ్రయంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (Bangladesh Nationalist Party) మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు. కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధాని రేసులో తారిక్ ముందు వరుసలో ఉన్నారు.
Also Read..
Helicopter Crash | కిలిమంజారో పర్వతంపై కూలిన హెలికాప్టర్.. ఐదుగురు మృతి