Rajasthan polling | రాజస్థాన్ ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. రంగంలోకి కేంద్ర బలగాలు
Rajasthan polling | రాజస్థాన్‌లో శనివారం పోలింగ్ (Rajasthan polling) సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర బలగాలు వెంటనే ఆ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నాయి.
జైపూర్: రాజస్థాన్‌లో శనివారం పోలింగ్ (Rajasthan polling) సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర బలగాలు వెంటనే ఆ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నాయి. పరిస్థితిని చక్కదిద్దాయి. సికార్ జిల్లాలోని ఫతేపూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక పోలింగ్ బూత్ సమీపంలో రెండు వర్గాలకు చెందిన ప్రజలు ఘర్షణకు దిగారు. రాళ్లు విసురుకున్నారు. సమీపంలోని ఇళ్లు, భవనాల పైనుంచి కూడా రాళ్లు రువ్వారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే కేంద్ర బలగాలకు చెందిన పారామిలిటరీ దళాలు, పోలీసులు ఆ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఘర్షణకు దిగిన గ్రూపులను చెదరగొట్టారు. అక్కడి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సంఘటన నేపథ్యంలో తాత్కాలికంగా నిలిచిన పోలింగ్ అనంతరం కొనసాగింది. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు రాజస్థాన్ వ్యాప్తంగా 51,000 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతున్నది. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు 55.63 శాతం ఓటింగ్ నమోదైంది.
#WATCH | Rajasthan Assembly elections: Stone pelting reported near Bochiwal Bhawan, Fatehpur Shekhawati in Sikar. Heavy Police deployed. pic.twitter.com/AAXLlkp5pn
— ANI (@ANI) November 25, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

