భోపాల్: విద్యుదాఘాతంతో ఒక కోతి మరణించింది. దీంతో చలించిపోయిన గ్రామస్తులు మనిషి మాదిరిగా అంత్యక్రియలు నిర్వహించారు. (Monkey Funeral) డీజే మ్యూజిక్ ఏర్పాటు చేయడంతోపాటు కొందరు డ్యాన్స్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం తమోలియా గ్రామంలో కరెంట్ షాక్‌తో ఒక కోతి మరణించింది.
కాగా, ఆ కోతి మరణం పట్ల గ్రామస్తులు చలించిపోయారు. దానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. స్థానిక శ్మశాన వాటిక వరకు భారీగా శవ యాత్ర నిర్వహించారు. చనిపోయిన కోతిపై పూల వర్షం కురిపించారు. డప్పులు మోగించడంతోపాటు భక్తి పాటలు, డీజే మ్యూజిక్కు కొందరు వ్యక్తులు డ్యాన్స్‌లు చేశారు. శ్మశాన వాటికలో హిందూ సాంప్రదాయ ఆచారాలతో ఆ కోతికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత కోతి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన గ్రామస్థులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | MP: Villagers Hold Funeral For Monkey In Rajgarh; Video Shows People Dancing To Music In Farewell Procession#MadhyaPradesh #MPNews pic.twitter.com/jNJwSPcGfa
— Free Press Madhya Pradesh (@FreePressMP) August 26, 2024