Viral Post | ఆశా భోస్లే రెస్టారెంట్లో దేశీ వంటకాలను ఆస్వాదించిన అమెరికన్ సింగర్
ప్రపంచవ్యాప్తంగా భారతీయ రుచులను ఎంతో మంది ఇష్టంగా ఆస్వాదిస్తుంటారు. ఈ జాబితాలో ప్రముఖ అమెరికన్ సింగర్, రచయిత పింక్ (Viral Post) చేరిపోయారు.
లండన్ : ప్రపంచవ్యాప్తంగా భారతీయ రుచులను ఎంతో మంది ఇష్టంగా ఆస్వాదిస్తుంటారు. ఈ జాబితాలో ప్రముఖ అమెరికన్ సింగర్, రచయిత పింక్ (Viral Post) చేరిపోయారు. బ్రిటన్‌లోని ఆశా భోస్లే రెస్టారెంట్‌ను సందర్శించిన ఆమె చికెన్ కర్రీ, నాన్ను ఇష్టంగా ఆరగించారు. బర్మింగ్‌హాంలో సమ్మర్ కార్నివాల్‌కు ముందు ఆమె యూకేలో ఇండియన్ రెస్టారెంట్‌ను సందర్శించి దేశీ రుచులను ఎంజాయ్ చేశారు.
ఆశా పేరుతో యూకేలో వెలిసిన ఈ రెస్టారెంట్‌ను గతంలో టామ్ క్రూజ్ సందర్శించి ఇక్కడి ఫుడ్‌ను ఎంతో ఇష్టంగా తిన్నారు. ఇక సింగర్ పింక్ భారత రెస్టారెంట్లో చేసిన సందడి విషయానికి వస్తే..ఆమె కొన్ని సమోసాలు, కుర్కురే మష్రూమ్నూ టేస్ట్ చేశారు. మెయిన్ కోర్స్‌లో ఆమె చెట్టినాడ్ చికెన్, దాబా చికెన్ కర్రీని నాన్‌తో కలిపి ఆరగించారు.
When the stars come to #Birmingham… They head to Asha’s 🌟🌟🌟
It was a pleasure to welcome @Pink ahead of her sell-out show this evening at Villa Park. In honour of P!NK’s visit, our expert mixologists created a new Gin-based cocktail, but it’s yet to be named… pic.twitter.com/Tfk3w8cjIj
— Asha’s (@Ashas_UK) June 13, 2023
స్టార్లు ఎవరైనా బర్మింగ్‌హాం పర్యటిస్తే వారు ఆశాకు వస్తారు..వారికి ఇదే మా స్వాగతం అని ఆశా రెస్టారెంట్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆశా రెస్టారెంట్లో ఆతిధ్యాన్ని స్వీకరించిన పింక్ ఇక్కడి ఆహారం చాలా బాగుందని ప్రశంసించారని బర్మింగ్‌హాం మెయిల్ పేర్కొంది. గత రాత్రి నేను నా జీవితంలోనే బెస్ట్ ఇండియన్ ఫుడ్ ఎంజాయ్ చేశానని కాన్సర్ట్‌లో తన ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కూడా పింక్ పేర్కొంది.
Read More :
Viral Post | బంధువులకు గుణపాఠం చెప్పేందుకు ఏం చేశాడంటే..!
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- American Singer
- P!NK
- UK
- Viral Posr
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

