న్యూఢిల్లీ : తనను తక్కువగా అంచనా వేస్తున్న బంధువులకు బుద్ధి చెప్పేందుకు బెల్జియం వ్యక్తి ఓ విచిత్రమైన పనికి పూనుకున్నాడు. తాను మరణించానని కట్టు కధ అల్లి (Viral Post ) ఆపై తన అంత్యక్రియలకు బంధువులంతా తరలిరాగా వారి సమక్షంలో హెలికాఫ్టర్‌లో అక్కడకు చేరుకున్నాడు.
ఒకరితో ఒకరు ఆప్యాయతలు పంచుకుంటూ మెలగాలని బంధువులకు గుణపాఠం చెప్పేందుకే డేవిడ్ (45) ఇలా చేశాడు. హెలికాఫ్టర్ పొలంలో ల్యాండ్ అవగా డేవిడ్ బంధువులు అతడిని చుట్టుముట్టి హగ్ చేసుకునే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫ్రాంక్ను చేసేందుకు డేవిడ్‌కు అతడి కూతుళ్లు కూడా సహకరించారు. లీగె ప్రాంతంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసే ముందు వారు బంధువులకు సంతాప సందేశాలు పంపారు. నీ ఆత్మ శాంతించాలి నాన్నా…నీ గురించి మేం తలచుకోని క్షణమంటూ ఉండదని ఈ సందేశంలో డేవిడ్ కూతురు రాసుకొచ్చారు.
జీవితం ఇంత అన్యాయం చేస్తుందా..? నువ్వు తాత కావాలి..జీవితాన్ని నిండుగా ఆస్వాదించాల్సి ఉండగా ఇలా ఎందుకు జరిగిందని ఈ స్టోరీని డేవిడ్ కూతురు మరింత రక్తికట్టించింది. డేవిడ్ మరణ వార్త విని పెద్దసంఖ్యలో బంధువులు అక్కడికి రాగా అతడు సజీవంగా ఉన్నాడని తెలిసి సంతోషించారు. హెలికాఫ్టర్ నుంచి డేవిడ్ బయట కాలుమోపగా వారంతా అతడిని స్వాగతించారు.
Read More :