Pahalgam Terrorist Attack | పాక్‌ను ఒంటిరిని చేసేలా మద్దతును కూడగడుతున్న భారత్.. విదేశీ దౌత్యవేత్తలతో సౌత్ బ్లాక్‌లో కీలక భేటీ..!
Pahalgam Terrorist Attack | పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో జర్మనీ, జపాన్, పోలాండ్, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఖతర్‌తో సహా అనేక దేశాల రాయబారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్‌లోని కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించింది. పహల్గాం దాడి ఘటన ఆయా దేశాల రాయబారులకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వివరించారు.
Pahalgam Terrorist Attack | పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో జర్మనీ, జపాన్, పోలాండ్, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఖతర్‌తో సహా అనేక దేశాల రాయబారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్‌లోని కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించింది. పహల్గాం దాడి ఘటన ఆయా దేశాల రాయబారులకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వివరించారు. పాక్ అండతో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డ తీరును ఆయా దేశాలకు వివరించి.. దాయాది దేశాన్ని ఏకాకిని చేసేదిశగా కేంద్రం రాయబారులతో సమావేశం ఏర్పాటు చేసింది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్‌ను ఎండగట్టేందుకు.. ఉగ్రదాదుల దాడిని ప్రపంచదేశాలకు వివరించే ప్రయత్నం చేసింది. చైనా, కెనడాతో సహా జీ20 దేశాలు, ఎంపిక చేసిన దేశాల రాయబారులకు పహల్గాం ఉగ్రవాద దాడి గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరించింది. సమావేశం దాదాపు 30 నిమిషాల పాటు కొనసాగింది. పహల్గాంలో ఉగ్రవాదులు ఎలా మారణకాండ సృష్టించారో వివరించి.. అంతర్జాతీయంగా ఆయా దేశాల మద్దతును కూడగట్టేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఇదిలా ఉండగా.. బుధవారం అర్ధరాత్రి విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ అత్యున్నత దౌత్యవేత్త సాద్ అహ్మద్‌ను సైతం పిలిపించిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం ఆయనకు ‘పర్సన నాన్ గ్రాటా’ నోట్‌ను జారీ చేసింది. పర్సన నాన్ గ్రాటా అంటే ఒక దౌత్యవేత్త లేదంటే.. ఓ విదేశీ వ్యక్తికి ఒక నిర్దిష్ట దేశంలో ప్రవేశం లేదంటే.. బస నిరాకరించినట్లుగా అర్థం. భారతదేశం ఈ నోట్‌ను పాకిస్తాన్ దౌత్యవేత్తలకు అందజేసింది. వారంతా వారంలోగా భారత్‌ను విడిచి వెళ్లాల్సి ఉండనున్నది. దక్షిణ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన సీసీఎస్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సహా ఇతర సీనియర్ మంత్రులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉగ్రవాద దాడిని తీవ్రంగా పరిగణించింది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో నియామకమైన రక్షణ, నావికాదళం, వైమానిక దళ సలహాదారులను పర్సన నాన్ గ్రాటా (Unwanted)గా ప్రకటించాలని సీసీఎస్ నిర్ణయించిందని విదేశాంగ కార్యదర్శి తెలిపారు.
ఈ క్రమంలో ఆయా దౌత్యవేత్తలను వారం రోజుల్లోగా భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. దీనితో పాటు, ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ నుంచి భారతదేశం తన సైనిక సలహాదారులను సైతం వెనక్కి పిలువనున్నది. అట్టారి చెక్ పోస్ట్‌ను తక్షణమే మూసివేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. చెల్లుబాటు అయ్యే పత్రాలతో ఈ మార్గం ద్వారా ఇప్పటికే భారతదేశంలోకి ప్రవేశించిన వారు మే 1, 2025 నాటికి అదే మార్గం ద్వారా తిరిగి రావాలని సూచించింది. పాకిస్తాన్‌తో సింధు జల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయాలని కూడా భారతదేశం నిర్ణయించింది. సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్తాన్ పౌరులు ఇకపై భారత్‌లో ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వరు. వీసా స్కీమ్ కింద భారతదేశంలో ఉన్న పాకిస్తానీ పౌరులు 48 గంటల్లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.
#WATCH | Delhi: Ministry of External Affairs (MEA) briefed selected envoys of G20 countries, including China and Canada, on the Pahalgam terror attack. The meeting lasted for 30 minutes.
(Visuals of ambassadors leaving from the office of the Ministry, located in the South Block… pic.twitter.com/Vrd415hamB
— ANI (@ANI) April 24, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

