లండన్ : అమెజాన్ (Amazon) ప్రైమ్ డే సేల్కు ముందు బ్రిటన్ వేర్‌హౌస్ వద్ద వేతన వివాదంపై ఈ-కామర్స్ కంపెనీ ఉద్యోగులు మూడు రోజుల సమ్మెకు సన్నద్ధమయ్యారు. జులై 11 నుంచి జులై 13 వరకూ సమ్మె చేపట్టేందుకు వర్కర్లు కసరత్తు సాగిస్తున్నారు. జులై 11న బ్రిటన్‌లో ప్రైమ్ డే సేల్ ఈవెంట్ ప్రారంభమై 12న ముగుస్తుండగా అదే సమయంలో అమెజాన్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు.
అయితే ఉద్యోగులు సమ్మె చేపట్టే వేర్‌హౌస్ కస్టమర్ల ఆర్డర్లను నేరుగా డీల్ చేయనందున వర్కర్ల సమ్మె కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపదని భావిస్తున్నారు. ఈ సమ్మెలో బ్రిటన్‌లోని కోవెంట్రీ వేర్‌హౌస్‌కు చెందిన 900 మంది వర్కర్లు పాల్గొంటున్నారని కార్మిక సంఘం జీఎంబీ వెల్లడించింది.
జులై 11, 12, 13 తేదీల్లో ఉదయం రెండు గంటల పాటు ఆపై సాయంత్రం రెండు గంటల పాటు జరుగుతుందని లేబర్ యూనియన్ పేర్కొంది. సమ్మె చేపడుతన్న అమెజాన్ వర్కర్లు లొకేషన్ ఆధారంగా గంటకు 15 పౌండ్లు చెల్లించాలనే డిమాండ్‌తో పాటు ఇతర కార్మిక హక్కుల కోసం పోరాడుతున్నారని జీఎంబీ సీనియర్ ఆర్గనైజర్ రేచల్ ఫగన్ తెలిపారు.
Read More :