Amartya Sen | ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ కరోనా బారీన పడ్డారు. స్వలంగా జలుబు లక్షణాలు కనిపించడంతో ఆయన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని తన శాంతినికేతన్‌లోని నివాసంలో క్వారంటైన్ అయ్యారు. స్వల్పంగా దగ్గు, తుమ్ములు వస్తున్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారి ఒకరు తెలిపారు.
అమర్త్యసేన్ త్వరితగతిన కొవిడ్ నుంచి కోలుకోవాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆకాంక్షించారు. `గౌరవనీయ అమర్త్య దా.. మీరు త్వరితగతిన కోలుకోవాలని మేమంతా నిజాయితీగా ప్రార్థిస్తున్నాం` అని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. గత నెల చివరి వారం నుంచి అమర్త్యసేన్.. భారత్‌లోనే ఉన్నారు.