Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకే విశేష స్పందన..! 2లక్షల మందికిపైగా భక్తులకు దర్శనం..!
Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు పర్యాటకులు తరలివస్తున్నారు. వాతావరణం అనుకూలించడంతో మంచులింగం దర్శనాలు కొనసాగుతున్నాయి. బల్తాల్, పహల్గామ్ మార్గాల నుంచి తరలివస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2లక్షల మందికిపైగా బాబా బార్ఫానీని దర్శించుకున్నారు.
Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు పర్యాటకులు తరలివస్తున్నారు. వాతావరణం అనుకూలించడంతో మంచులింగం దర్శనాలు కొనసాగుతున్నాయి. బల్తాల్, పహల్గామ్ మార్గాల నుంచి తరలివస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2లక్షల మందికిపైగా బాబా బార్ఫానీని దర్శించుకున్నారు. మరో వైపు జమ్మూ నుంచి 7వేల మంది యాత్రికుల బృందం కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్నాథ్ గుహకు బయలుదేరింది.
కొద్ది రోజుల నుంచి భగవతి నగర్ బేస్ క్యాంపుకు అమర్నాథ్ యాత్రికుల సంఖ్య పెరిగింది. కొన్ని బ్యాచ్‌లలో ప్రతిరోజూ 7వేల నుంచి 9వేల మంది యాత్రికులు బేస్ క్యాంప్ జమ్మూ నుంచి దర్శనానికి వెళ్తున్నారు. సరస్వతి ధామ్ రైల్వేస్టేషన్లో టోకెన్ల జారీతో పాటు వైష్ణవి ధామ్ రైల్వే స్టేషన్, పంచాయతీ భవన్ రైల్వే స్టేషన్లో తక్షణ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రామ మందిరం పురాణి మండి, గీతా భవన్ పరేడ్‌లో సాధువుల రిజిస్ట్రేషన్ జరుగుతున్నది.
మరో వైపు అమర్నాథ్ యాత్రపై రైల్వే డీజీపీ సునీల్‌కుమార్ సమీక్షించారు. ట్రాక్‌లపై పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, భద్రతను పటిష్టం చేయాలని ఆదేశించారు. పలు రైళ్లను రద్దు చేయడంతో జమ్మూ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని డీజీపీ పేర్కొన్నారు. రైలు సేవలు పూర్తిగా పని చేసేవరకు చాలా మంది తాత్కాలికంగా జమ్మూలో ఉండేందుకు ఇష్టపడుతున్నారని అధికారులు పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది ప్రయాణికులతో సానుభూతితో వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హెల్ప్ డెస్క్‌ను కూడా సందర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

