అధికారుల నుంచే పరిహారం రికవరీ!
అధికారుల జీతం నుంచే పరిహారం రికవరీ చేయాలని అలహబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన న్యాయ విద్యార్థిని, కార్యకర్త ఆకృతి చౌదరి(24)ని జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ)కింద నిర్బంధిస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. ఆమెను నిర్బంధించాలని ఆదేశించిన నోయిడా జిల్లా మెజిస్ట్రేట్ తీరుపై కోర్టు తీవ్రంగా స్పందించింది.
- విద్యార్థిని నిర్బంధం కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: అధికారుల జీతం నుంచే పరిహారం రికవరీ చేయాలని అలహబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన న్యాయ విద్యార్థిని, కార్యకర్త ఆకృతి చౌదరి(24)ని జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ)కింద నిర్బంధిస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. ఆమెను నిర్బంధించాలని ఆదేశించిన నోయిడా జిల్లా మెజిస్ట్రేట్ తీరుపై కోర్టు తీవ్రంగా స్పందించింది. నోయిడా డీఎంతో పాటు మొత్తం పరిపాలనా వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ అచల్ సచ్‌దేవ్‌లతో కూడిన ధర్మాసనం గత వారం ఈ కేసును విచారించింది.
ఆకృతి చౌదరి నిర్బంధం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ఆమెకు కల్పించిన ప్రాథమిక హక్కును ఉల్లంఘించిందని పేర్కొంది. నిర్బంధ ఉత్తర్వులు, అందుకు పేర్కొన్న కారణాలు ఎటువంటి ఆధారాలు లేనివిగా ధర్మాసనం అభిప్రాయపడింది. ఆకృతి చౌదరికి రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని జిల్లా మెజిస్ట్రేట్‌తో పాటు బాధ్యులైన ఇతర అధికారుల జీతాల నుంచి రికవరీ చేయాలని, చివరకు సంబంధిత ఎస్‌హెచ్‌వో వరకు బాధ్యత వహించే అధికారుల జీతాల నుంచి వసూలు చేయాలని స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

