నా రిటైర్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారా?
ఆరావళి పర్వత శ్రేణులకు సంబంధించిన వివాదంలో తాము ఏర్పాటు చేసిన హైపవర్డ్ కమిటీ(హెచ్పీసీ) నివేదిక సమర్పించేందుకు మరో ఆరు నెలల సమయం ఇవ్వాలన్న అభ్యర్థనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్.. తన ఉద్యోగ విరమణ కోసం కమిటీ ఎదురు చూస్తున్నదా? అని వ్యాఖ్యానించారు.
- ‘ఆరావళి’ కమిటీ గడువు పొడిగింపును తిరస్కరించిన సీజేఐ
న్యూఢిల్లీ: ఆరావళి పర్వత శ్రేణులకు సంబంధించిన వివాదంలో తాము ఏర్పాటు చేసిన హైపవర్డ్ కమిటీ(హెచ్పీసీ) నివేదిక సమర్పించేందుకు మరో ఆరు నెలల సమయం ఇవ్వాలన్న అభ్యర్థనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్.. తన ఉద్యోగ విరమణ కోసం కమిటీ ఎదురు చూస్తున్నదా? అని వ్యాఖ్యానించారు.న్యాయమూర్తులు జాయ్ మాల్య బాగ్చీ, వీ మోహనలతో కూడిన ధర్మాసనం నవంబర్ 30లోగా నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది.
విచారణ కోసం ఈ అంశాన్ని ధర్మాసనం స్వీకరించిన వెంటనే సీజేఐ ‘నా ఉద్యోగ విరమణ తర్వాత తేదీ ఇవ్వమని నేరుగా అడిగి ఉండాల్సింది’ అని వ్యాఖ్యానించారు. ‘వారికి పగలు, రాత్రి పనిచేయమని చెప్పండి. రెండు నెలల్లో నివేదిక ఇవ్వండి’ అని కమిటీ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటీకి సీజేఐ తెలిపారు. హెచ్పీసీ దీనిపై పనిచేస్తున్నది. రెండు నెలల్లో నివేదిక సమర్పిస్తుందని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం ఈ కేసును తదుపరి విచారణ కోసం డిసెంబర్ 2కి ధర్మాసనం జాబితా చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

