ముంబై ఎయిర్పోర్ట్ సర్వర్లు డౌన్.. కౌంటర్ల వద్ద భారీ క్యూలు, విమాన సేవలకు అంతరాయం
సర్వర్ల క్రాష్ వల్ల కంప్యూటర్లు పని చేయకపోవడంతో మ్యానువల్ పద్ధతిని ఎయిర్పోర్ట్ సిబ్బందిని పాటిస్తున్నారు. దీంతో ప్రయాణికులు పలు గంటలపాటు క్యూలల్లో వేచి ఉన్నారు.
ముంబై: మహరాష్ట్ర రాజధాని, దేశ వాణిజ్య నగరమైన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రం సర్వర్లు డౌన్ అయ్యాయి. దీంతో గురువారం సాయంత్రం విమానాశ్రయంలోని టెర్మినల్ 2లో అన్ని వ్యవస్థలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో చెక్ ఇన్, లగేజ్ కోసం ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. సర్వర్ల క్రాష్ వల్ల కంప్యూటర్లు పని చేయకపోవడంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది మ్యానువల్ పద్ధతిని పాటిస్తున్నారు. దీంతో ప్రయాణికులు పలు గంటలపాటు క్యూలల్లో వేచి ఉన్నారు. దీని వల్ల విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. దీంతో విమానాశ్రయం అంతటా గందరగోళం నెలకొన్నది.
మరోవైపు ఇబ్బందులు ఎదుర్కొన్న విమాన ప్రయాణికులు తమ ఆవేదనను ట్విట్టర్లో వ్యక్తం చేశారు. చెక్ ఇన్ కౌంటర్ వద్ద తన బ్యాగ్‌ను ఉంచిన వెంటనే సిస్టమ్ క్రాష్ అయినట్లు ఒక మహిళ పేర్కొన్నారు. కాగా, ప్రయాణికుల ఇబ్బందిపై ఎయిర్ ఇండియా స్పందించింది. వారికి ఎదురైన అసౌకర్యాన్ని నివారించేందుకు తమ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని ట్వీట్ చేసింది. అయితే ఎయిర్పోర్ట్టెర్మినల్ 2లో రెండు గంటల తర్వాత సాధారణ పరిస్థితి నెలకొన్నది.
https://twitter.com/kiwitwees/status/1598286321889542144?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1598286321889542144%7Ctwgr%5E77237b30a40da3edc30c405d64fe7e32d25fc536%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Findia-news%2Fmassive-queues-at-mumbais-t2-airport-after-systems-go-down-3569526
We understand that delays are certainly uncomfortable. Our team is working diligently to minimize the inconvenience. They'll be in touch with you for further updates.
— Air India (@airindia) December 1, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

