విజయవాడ: జీవితం చాలా చిన్నదని, దీనిని ఉత్సవంగా మలుచుకొని ఆనందంగా గడపాలని ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ పేర్కొన్నారు. కార్తీకమాస క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా విజయవాడలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ మహా సత్సంగం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి శ్రీశ్రీ రవిశంకర్ హాజరై ప్రసంగించారు. 1981లో ఇదే రోజు వేద విజ్ఞాన మహా విద్యాపీఠం పేరుతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రారంభమైనట్టు ఆయన గుర్తు చేశారు. ప్రజలు మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఆత్మవిశ్వాసం, దైవ విశ్వాసం, ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చని పేర్కొన్నారు. అంతకుముందు ఏపీ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఏర్పాటు చేసిన యూనిటీ ఇన్ డైవర్సిటీ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు.