Mallikharjuna Kharge: కనీస మద్దతు ధరపై చట్టం చేయాలన్నదే అన్ని పార్టీల డిమాండ్
Mallikharjuna Kharge: దవ్యోల్బణం, ఇంధన ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, కరోనా వైరస్ తదితర అంశాలు అఖిలపక్ష సమావేశంలో చర్చకు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే

న్యూఢిల్లీ: దవ్యోల్బణం, ఇంధన ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, కరోనా వైరస్ తదితర అంశాలు అఖిలపక్ష సమావేశంలో చర్చకు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ( Mallikharjuna Kharge ) చెప్పారు. ఆల్పార్టీ మీటింగ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధానంగా కనీస మద్దతు ధరకు హామీ ఇస్తూ కేంద్రప్రభుత్వం చట్టం చేయాలని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయని తెలిపారు.
కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని తాము డిమాండ్ చేశామని మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. అదేవిధంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ మరణించిన రైతుల కుటుంబాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశానికి ప్రధాని హాజరవుతారని తాము భావించామని, కానీ కొన్ని కారణాల వల్ల ఆయన హాజరుకాలేదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటామని ప్రకటించిందని, అయితే ఆ సందర్భంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ఖర్గే చెప్పారు. తనను రైతులు అర్థం చేసుకోలేదని ప్రధాని వ్యాఖ్యానించినట్లు తెలిపారు. కేంద్రం వ్యవసాయ చట్టాలను భవిష్యత్తులో మరో రూపంలో తీసుకురానుందనేదే ప్రధాని మాటలకు అర్థమని వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

