AIKS | న్యూఢిల్లీ, (నమస్తే తెలంగాణ): రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఎన్నికల జిమ్మిక్కేనని ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షుడు అశోక్ దావలే విమర్శించారు. కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీతో రైతులు నష్టాల్లో కూరుకుపోతారని ఆయన పేర్కొన్నారు. వరికి రూ.143 మాత్రమే మద్దతు ధర పెంచడాన్ని ఆయన తప్పుబట్టారు. వరి పండించేందుకు అయ్యే వ్యయం… వ్యవసాయ వ్యయాల కమిషన్ అంచనాలను మించిపోయాయని చెప్పారు.
కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీ రైతులకు ఉపయోగకరంగా లేదని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బీ వెంకట్ విమర్శించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో గురువారం ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరించేందుకే మోదీ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.