శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై ఉన్న సలాల్ డ్యామ్( Salal Dam) గేట్లను మూసివేశారు. అన్ని గేట్లను మూసివేయడంతో.. ఆ నదిలో నీటి ప్రవాహం తగ్గింది. దీంతో పాకిస్థాన్‌కు ఆ నది నుంచి నీరు ప్రవహించడంలేదు. నీనాబ్ నదిపై రాంబన్‌లో ఉన్న బాగ్లిహర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు డ్యామ్‌ను కూడా మూసివేశారు. దీంతో పాక్‌కు వెళ్లే నీటి ప్రవాహం గణనీయంగా తగ్గింది.
#WATCH | Jammu and Kashmir: Visuals from Reasi, where all gates of Salal Dam on Chenab River are closed. pic.twitter.com/oS6gSaXYYx
— ANI (@ANI) May 6, 2025
పాకిస్థాన్‌కు చెడు రోజులు దగ్గరపడినట్లు రియాసీ స్థానికులు చెబుతున్నారు. వాళ్లు ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవడం లేదన్నారు. వినాశనకర కోణంలో పాకిస్థాన్ వెళ్తోందని ఓ స్థానికుడు ఆరోపించారు. వాళ్లు గుణపాఠం చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. వాళ్లు ఇలాగే కొనసాగితే యుద్ధం అనివార్యం అవుతుందన్నారు. ఎంత వరకు ఇండియా సహనాన్ని ప్రదర్శిస్తుందన్నారు. భారత్ తీసుకున్న నిర్ణయం మెల్లమెల్లగా ప్రభావం చూపుతోందన్నారు. పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పేందుకు భారత్ సరైన నిర్ణయం తీసుకున్నట్లు మరో వ్యక్తి అన్నారు. 26 మంది ప్రాణాలను బలి తీసుకున్నారని, ఇప్పుడు వాళ్లు అర్థం చేసుకోవాలన్నారు.
#WATCH | J&K: Visuals from Ramban where all gates of Baglihar Hydroelectric Power Project Dam on Chenab River are closed pic.twitter.com/vKmtljchhF
— ANI (@ANI) May 6, 2025
పెహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చర్యలో భాగంగా పాకిస్థాన్‌కు ప్రవహించే నది నీళ్లను భారత్ అడ్డుకుంటున్నది. దానిలో భాగంగానే చీనాబ్ నదిపై ఉన్న డ్యామ్‌లను మూసివేస్తూ నీటి సామర్థ్యాన్ని పెంచుతున్నది.