ముంబై(నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి నాగాలాండ్‌లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు అధికార నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీలో చేరారు.
ఈ విలీనంతో 60 మంది సభ్యులున్న అసెంబ్లీలో సీఎం నెప్యూ రియో నేతృత్వంలోని ఎన్డీపీపీ బలం 25 నుంచి 32కి చేరి శాసనసభలో పూర్తి మెజారిటీని సాధించింది. శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక తర్వాత, నాగాలాండ్ యూనిట్ అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి మద్దతు ఇచ్చింది.