Flying Car | రోడ్డుపై బారులు తీరిన వాహనాల మధ్య ఇరుక్కుపోకుండా.. వాటి మీదుగా ఎగురుతూ వెళితే ఎలా ఉంటుంది? అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ కంపెనీ అలెఫ్ ఏరోనాటిక్స్ ‘మాడల్ జీరో’ కార్ దీన్ని నిజం చేయనుంది. ఇటీవల జరిపిన పరీక్షల్లో ఈ కారు ఎలాంటి రెక్కలు లేకుండానే గాల్లోకి ఎగిరింది.
ఈ కారును 110 మైళ్లు గాలిలో, 200 మైళ్లు రోడ్డుపై ప్రయాణించగల రేంజ్‌తో తీసుకు రానున్నారు. ఇది ఉన్న చోటు నుంచే పైకి ఎగరగలదు. దీని ధర దాదాపు రూ.2.5 కోట్లు ఉండొచ్చని అంచనా. ఇప్పటికే ఈ కారు కోసం ౩౩౦౦ ప్రీ ఆర్డర్లు వచ్చాయి. 2035 నాటికి ఈ కారు అప్డేటెడ్ మాడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ వర్గాలు తెలిపాయి.