శనివారం 23 జనవరి 2021
National - Dec 25, 2020 , 17:42:30

ఆ పార్కులో భారీ తాబేలు మాయ‌మైంది!

ఆ పార్కులో భారీ తాబేలు మాయ‌మైంది!

చెన్నై: ప‌్ర‌పంచంలోనే రెండో అతిపెద్ద అల్ద‌బ్రా జాతి తాబేలును దొంగ‌లు ఎత్తుకెళ్లారు. త‌మిళ‌నాడు రాష్ట్రం మ‌హ‌బ‌లిపురంలోని క్రొక‌డైల్ పార్కు నుంచి దొంగ‌లు ఆ తాబేలును మాయం చేశారు. అంత‌ర్జాతీయ మార్కెట్లో ఆ తాబేలు విలువ రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని క్రొక‌డైల్ పార్క్ అధికారులు తెలిపారు. అయితే, ఆరు వారాల క్రిత‌మే తాబేలు దొంగ‌త‌నం జ‌రుగ‌గా ఈ విష‌యం ఇప్పుడు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. 

క్రోక‌డైల్ పార్కు అధికారుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ దొంగ‌త‌నంలో పార్కులో ప‌నిచేసే వ్య‌క్తుల హ‌స్తం కూడా ఉందేమోన‌న్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇప్ప‌టికే పార్కులోని సిబ్బంది అంద‌రినీ ప్ర‌శ్నించి వారి వాంగ్మూలాలను న‌మోదు చేశారు. ప్రాథ‌మిక ద‌ర్యాప్తు పూర్తిచేసిన పోలీసులు.. నవంబ‌ర్ 11-12 తేదీల మ‌ధ్యరాత్రి ఈ తాబేలు దొంగ‌త‌నం జ‌రిగి ఉంటుంద‌ని అంచనా వేస్తున్నారు.

ఈ దొంగ‌త‌నం ప‌క్కా ప్లాన్‌తో జ‌రిగింద‌ని, తాబేలు ఎన్‌క్లోజ‌ర్ ప‌రిస‌రాల్లోని సీసీ కెమెరాల‌కు చిక్క‌కుండా దొంగ‌లు త‌మ కానిచ్చేయ‌డాన్ని బ‌ట్టి ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ద‌ని పోలీసులు చెప్పారు. పార్కు నుంచి బ‌య‌ట‌ప‌డ్డ అనంత‌రం ఈస్ట్‌కోస్ట్ రోడ్డు గుండా దొంగ‌లు పారిపోయిన‌ట్లు తెలుస్తున్న‌ద‌న్నారు. త‌మ ద‌గ్గ‌రున్న ప్రాథ‌మిక స‌మాచారం ఆధారంగా ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నామ‌ని తెలిపారు.

కాగా, తాబేలు దొంగ‌త‌నం జ‌రిగిన పార్కులో మొస‌ళ్లు, పాములు, తాబేళ్లు స‌హా వంద‌ల ర‌కాల స‌రీసృపాలు ఉన్నాయ‌ని అధికారులు తెలిపారు. పార్కులో మొత్తం నాలుగు అల్ద‌బ్రా ర‌కం తాబేళ్లు ఉండ‌గా అందులో ఒక‌టి దొంగ‌త‌నానికి గురైంద‌ని చెప్పారు. గాల‌పాగ‌స్ దీవుల్లో క‌నిపించే ఈ అల్ద‌బ్రా తాబేళ్లు ప‌రిమాణంలో ప్ర‌పంచంలోనే రెండో అతిపెద్ద జాతికి చెందిన‌వ‌న్నారు. మీట‌రున్న వ‌ర‌కు పొడ‌వు, 200 కేజీల వ‌ర‌కు బ‌రువు పెరిగే ఈ తాబేళ్లు 150 ఏండ్లు జీవిస్తాయ‌ని అధికారులు తెలిపారు. దొంగ‌లించ‌బ‌డిన తాబేలు 80-100 కిలోల బ‌రువు ఉండేద‌ని, దాని వ‌య‌సు 50 ఏండ్లు అని వెల్ల‌డించారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

44 వేల కోట్ల విలువైన బంగారు నిధి దొరికింది

ఆకాశం నుంచి ప‌డిన భారీ ఫైర్‌బాల్.. ఉల్కేనా?

ఈ ఏడాది గూగుల్‌లో వెతికింది వీళ్ల కోసమే..

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo