అల్ ఫలాహ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ ట్రస్టీ జావెద్ అహ్మద్ సిద్ధిఖీ 9 సంస్థలను ఏర్పాటు చేయటం, వాటికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ పెట్టుబడి పథకాలతో నిధులను సేకరించాడన్న కేసులో 2001లో అరెస్టు కాగా, రూ.7.5 కోట్ల మోసం కేసులో మూడేండ్లపాటు జైల్లో ఉన్నాడు.
ఇక ఢిల్లీ పేలుడు ఘటనలో ప్రధానంగా వినిపించిన ‘అల్ ఫలాహ్ యూనివర్సిటీ’ (ఫరీదాబాద్)కు ఆయనే వ్యవస్థాపకుడు, మేనేజింగ్ ట్రస్టీ. ఈ వర్సిటీకి ఆయన పెద్ద ఎత్తున నిధులు సేకరించగా, వీటిపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది.