UP Akhilesh | ముచ్చటగా మూడోసారి ఫెయిల్.. ఇదీ అఖిలేశ్ పొత్తుల థియరీ!
UP Akhilesh | ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మూడుసార్లు పెట్టుకుని విఫలం అయ్యారు.
UP Akhilesh | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2012లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన అఖిలేశ్.. తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అటుపై 2017 అసెంబ్లీ, 2019 లోక్‌సభ, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పెట్టుకున్న పొత్తులు ఫలించలేదు. తద్వారా ముచ్చటగా మూడుసార్లు పొత్తులతో విజయం సాధించలేకపోయారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోనూ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీతోనూ, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానిక రాజకీయ పార్టీలతోనూ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలిచినా విజయ తీరాలకు చేరలేకపోయారు. 2017 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో, 2019 తర్వాత బీఎస్పీతో పొత్తుకు గుడ్‌బై చెప్పారు అఖిలేశ్ యాదవ్.
ఐదు పార్టీలతో జత కట్టిన ఎస్పీ
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పట్టు కలిగి ఉన్న ఐదు చిన్న పార్టీలతో అఖిలేశ్ యాదవ్ జత కట్టారు. ఓం ప్రకాశ్ రాజ్‌భర్ సారధ్యంలోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ), జయంత్ చౌదరి ఆధ్వర్యంలోని రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ), బాబాయి శివ్‌పాల్ యాదవ్ సారధ్యంలోని ప్రగతి శీల్ సమాజ్‌వాదీ పార్టీ (పీఎస్పీ), అప్నాదల్ (కమేరావాదీ), మహన్దళ్లతో పొత్తు పెట్టుకున్నారు. 403 స్థానాల్లో ఎస్పీ 345, ఆర్ఎల్డీ 33, ఎస్బీఎస్పీ 19, అప్పాదళ్ (కే) ఆరు సీట్లలో పోటీ చేశాయి.
2017లో ఫలితాలు ఇలా
2017 ఎన్నికల్లో ఎస్బీఎస్పీ, బీజేపీతో జత కట్టి 8 సీట్లలో పోటీ చేసింది. 0.7 శాతం ఓట్లతో నాలుగు స్థానాలు గెలుచుకుంది. తర్వాత బీజేపీతో పొత్తుకు గుడ్‌బై చెప్పి, అసదుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలో ఎంఐఎంతో చేతులు కలిపారు రాజ్‌భర్. కానీ తర్వాత ఎంఐఎంకు రాంరాం చెప్పి ఎస్పీతో జత కట్టారు. పశ్చిమ యూపీలో ప్రాతినిధ్యం గల జాట్లలో పట్టు ఉన్న పార్టీ ఆర్ఎల్డీ. 2014 ఎన్నికల్లో ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలుచుకోలేదు. 2017 ఎన్నికల్లో 277 స్థానాల్లో పోటీ చేసి ఒకసీటులో విజయం సాధించారు. 1.78 శాతం ఓట్లు పొందినా 266 సీట్లలో డిపాజిట్ కోల్పోయింది.
2012లో సొంతంగా అధికారంలోకి ఎస్పీ
2012 అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా ఎస్పీ విజయం సాధించింది. అటుపై ఎస్పీ వ్యవస్థాపక అధినేత ములాయం సింగ్ యాదవ్.. తనయుడు అఖిలేశ్ యాదవ్‌కు ప్రభుత్వ పగ్గాలు అప్పగించారు. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కట్టినా బీజేపీ జైత్రయాత్రను అఖిలేశ్ యాదవ్ నిలువరించలేకపోయారు. 47 ఎస్పీ, ఏడు కాంగ్రెస్ గెలుచుకున్నది. బీజేపీ 325 స్ధానాలతో విజయం సాధించి అధికారం చేపట్టింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. బువా-బుతిజా జోడీ పేరిట లోక్‌సభ బరిలో దిగిన అఖిలేశ్-మాయావతి జోడీ మెరుగైన ఫలితాలు సాధించారు. విడిగా చూస్తే బీఎస్పీ 10 సీట్లలో గెలుపొందితే, ఎస్పీ ఐదు స్థానాలకే పరిమితమైంది. 2014 ఎన్నికల్లో బీఎస్పీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Akhilesh Yadav
- BSP
- Congres
- RLD
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

